ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ లో లీజు చెల్లించకుండా చేపలు పట్టడం నిసిద్ధం..పోలీసులకు ఫిర్యాదు చేసిన మత్స్యశాఖ అధికారులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి గ్రామం వద్ద ఉన్న జీడిపల్లి రిజర్వాయర్ లో లీజు చెల్లించకుండా చేపలు పట్టడం నిషిద్ధం అని అన్యాక్రాంతంగా చేపలు పట్టే వారిపై పి ఎ బి ఆర్ ప్రాజెక్ట్ మత్స్య అభివృద్ధి అధికారి పెద్ద బాబు నాయక్ శనివారం బెలుగుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జూలై 1 నుండి ఏడాది కాలానికి లీజు చెల్లించి ప్రభుత్వ అనుమతులు పొందాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు హక్కులు పొందకుండా చేపలు పట్టడం పై పోలీసులు చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.