మంచిర్యాల: రామగుండంలో నవంబర్ 1 వరకు ఆంక్షలు: డీజేలు, డ్రోన్లపై నిషేధం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. బహిరంగ మద్యం, డీజేలు, అనుమతి లేని డ్రోన్లపై నిషేధం విధించారు. ధర్నాలు, ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.