కొండపి: జరుగుమల్లి మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయం చెందిన విద్యార్థులపై లైంగిక దాడికి యత్నం, పోలీసుల అదుపులో నిందితుడు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయానికి చెందిన విద్యార్థులపై ఓ రిటైర్డ్ ఉద్యోగి లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. అక్కడ పనిచేసే వంటమనిషి విద్యార్థులను రిటైర్డ్ ఉపాధ్యాయుడు కి అప్పగించగా అక్కడ విద్యార్థులు కేకలు వేయడంతో ఈ విషయం తెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని రిటైర్డ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందవలసి ఉంది.