సంతనూతలపాడు: సంతనూతలపాడు- ఒంగోలు రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
సంతనూతలపాడు నుండి ఒంగోలుకు వెళ్ళు రహదారిపై వంతెన నిర్మాణం జరుగుతుంది. అయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వంతెన పక్కనే ప్రత్యామ్నాయంగా మట్టి రోడ్డును నిర్మించారు. భారీ గ్రానైట్, వాహనాలు కంకర, మట్టిలోడుతో వెళ్తున్న వాహనాల వల్ల మట్టి రోడ్డు దెబ్బతిని పెద్ద ఎత్తున దుమ్ము, దూళి వెదజల్లుతుంది. ఈ రహదారి గుండా వాహనదారులు ప్రయాణించాలంటే ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.