దర్శి: దర్శి పోలీస్ స్టేషన్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Aug 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాడి వారి త్యాగాలు మరువలేనివి అని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని దేశ భవిష్యత్తుకు కృషి చేయాలన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లి విద్యార్థులకు ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సిఐ రామారావు తదితరులు పాల్గొన్నారు.