ములుగు: ములుగులో సీపీఎం నిరసన: సీఈసీని తొలగించాలని డిమాండ్
Mulug, Mulugu | Sep 27, 2026 ములుగు అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.