చిల్పూర్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జనగామ విద్యార్థిని జీడి ప్రీతి
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట పాఠశాల విద్యార్థిని జీడి ప్రీతి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. వేములవాడలో జరగనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ప్రీతిని అభినందించారు.