నగరి: బస్టాండ్ సమీపంలోని మద్యం దుకాణాలను తరలించాలని డిమాండ్
నగరి బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న మద్యం దుకాణాలను ఊరి వెలుపలకు తరలించాలని సీపీఐ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. దుకాణాల వల్ల మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, బహిరంగంగా మద్యం సేవించడంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.