ఒంగోలు అర్బన్: మద్దిపాడు లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న, ఎమ్మెల్యే విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం జిల్లా మద్దిపాడులో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇండ్ల వద్దనే పెన్షన్లు అందజేసి ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు. తర్వాత మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిష్కరిస్తామని కలెక్టర్ రాజబాబు అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.