కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శనివారం నంద్యాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్తమ సేవ ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎస్పీ సునీల్ సోరాన్, కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. దీంతో పలువురు అధికారులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.