కుప్పం: కుప్పం రైతుల కోసం గుడ్ న్యూస్: కేవలం 14 రూపాయలకే కిలో ఉలవలు పంపిణీ
కుప్పం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కెంచనబల్ల పంచాయతీలో రైతులకు రాయితీపై ఉలవల పంపిణీ చేపట్టారు. మార్కెట్లో 79 రూపాయల విలువ చేసే కిలో ఉలవలను, రైతులకు కేవలం 14 రూపాయలకే అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతులను ఆదుకునే దిశగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మునిరాజు తెలిపారు.