గాజువాక: వడ్లపూడి బస్ స్టాప్ ను పర్మినెంట్ చేయాలని డిపో మేనేజర్ కు వినతి
గాజువాక 87వ వార్డు వడ్లపూడి బస్ స్టాప్ ను పర్మినెంట్ చేయాలని కోరుతూ కూర్మన్నపాలెం డిపో మేనేజర్ కు మాజీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం వినతి పత్రం అందజేశారు. 28 వేల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.