పరకాల: పరకాలలో దారుణం: తల్లీకుమార్తెలపై కత్తితో దాడి.. కూతురు మృతి
హన్మకొండ జిల్లా పరకాలలోని ఆకులవాడలో తల్లీకుమార్తెలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో సుగుణమ్మ మృతి చెందగా, లక్ష్మమ్మ తీవ్ర గాయాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.