నంద్యాల అర్బన్: మహానంది ఆలయంలో పోగొట్టుకున్న మూడు బంగారు హారం తిరిగి బాధితులకు అప్పగింత
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
విజయవాడ నగరానికి చెందిన విజయలక్ష్మీ, మూర్తి దంపతులు శనివారం మహానందికి వచ్చారు. కోనేరులో స్నానం చేస్తుండగా మూడు తులాల బంగారు నక్లెస్ పడిపోయింది. స్నానం అనంతరం బయటికి వచ్చిన వారు గమనించి వెంటనే ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి తీసుకెళ్లారు. ఏజెన్సీ సిబ్బంది చేత వెతికించి దొరికిన హారాన్ని భక్తులకు అందించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.