గిద్దలూరు: గిద్దలూరులో ఆర్టిసి బస్సులో ప్రయాణించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఆర్టిసి బస్సులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం ప్రయాణించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఇప్పటికే ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతోపాటు తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలోకి 13వేల రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అలానే వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు వాళ్ళని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.