భీమారం: భీమారం బస్టాండ్ వద్ద పిచ్చికుక్క స్వైరవిహారం: నలుగురికి గాయాలు
మంచిర్యాల జిల్లా భీమారం బస్టాండ్ సమీపంలో పిచ్చికుక్క దాడి చేయడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వరుస దాడులతో భయాందోళన చెందుతున్న స్థానికులు, కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.