గిద్దలూరు: రాచర్ల మండలంలో నూతన రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో రోడ్ల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రాచర్ల మండలంలోని సత్య వోలు, ఎడవల్లి గ్రామాలలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండలాలకు మండలాల నుంచి నియోజకవర్గ హెడ్ కోటర్స్ కు కనెక్టివిటీ రోడ్లను బాగు చేస్తామని ఇప్పటికే నియోజకవర్గంలో రూ.30 కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.