ఉరవకొండ: నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సన్నాహక సమావేశం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సన్నాహక సమావేశాన్ని ఆదివారం ఉరవకొండ వైస్సార్సీపీ పీఏసీ సభ్యులు, పార్టీ సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి ఐడీ కార్డులను పంపిణి చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉరవకొండ అబ్జర్వర్ మడకశిర గోవర్ధన్ రెడ్డి, రాయలసీమ ఫోరం కన్వీనర్ రమణ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేయడం, కరువు పరిస్థితులపై పోరాడేందుకు దిశానిర్దేశం చేశారు.