శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండో రోజు వరుణ యాగ సహిత సహస్రఘటాభిషేకం
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండో రోజు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఋష్యశృంగ జపం, వారుణానువాక పారాయణలు, వరుణ జపం, భాగవత, విరాటపర్వ పారాయణలు, పంచాక్షరీ జపం నిర్వహిస్తున్నారు. అలాగే నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు గణపతి, రుద్ర, మృత్యుంజయ హోమాలతో పాటు వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. అదేవిధంగా నేడు, రేపు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచి మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.