మామిడికుదురు: మగటపల్లిలో ఘనంగా జిఎంసి బాలయోగి 75వ జయంతోత్సవం!
మగటపల్లిలో జిఎంసి బాలయోగి 75వ జయంతోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన సేవలను కొనియాడారు. పెండింగ్లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.