సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి అండర్ 17 హాకీ పోటీలకు ఎంపికైన మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు
మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 17 విభాగంలో వీరు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి ఆదివారం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తిరుపతిలో జరిగే అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో హైస్కూల్ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పిఈటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.