ఒంగోలు అర్బన్: వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన కార్మికుల మధ్య స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్న కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | Aug 15, 2026
ప్రకాశం జిల్లాలోని అల్లూరు మండలంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన కార్మికుల మధ్య జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి కలెక్టర్ రాజాబాబు వేడుకలు నిర్వహించుకుని ఆనందం వ్యక్తం చేశారు. వీరి మధ్య ఖచ్చితంగా వేడుకలు జరుపుకోవాలని కల్పనా కుమారి కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ రాజబాబు అన్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన కార్మికులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాలన్నీ అందిస్తామని తెలిపారు.