జగ్గంపేట: జగ్గంపేటలో రచ్చ: కూటమిలో జనసేనకు ప్రాధాన్యత లేదా? అసంతృప్తిలో జనసైనికులు
జగ్గంపేట నియోజకవర్గంలోని సూరంపాలెంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో, తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.