నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు గెలుచుకున్న తాండవ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల
అనకాపల్లి జిల్లా తాండవలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ - 2026' కు ఎంపికైంది. ఉత్తమ పరిశుభ్రత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డు లభించింది. పాఠశాల సిబ్బంది, విద్యార్థులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందించారు.