రాయికల్: అల్లీపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, పరీక్షలు చేయించుకోవాలని సూచన
Raikal, Jagtial | Sep 29, 2026 రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో హెచ్ఐవి, టీబీ, రక్త పరీక్షల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ముందస్తు పరీక్షలతోనే వ్యాధుల నివారణ సాధ్యమని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత పరీక్షలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.