విశాఖపట్నం: సింహాచలంలో కమనీయంగా సాగిన గరుడ సేవ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి గరుడ సేవ ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో ప్రతిష్టించి పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.