గంగాధర నెల్లూరు: జిల్లా స్థాయి స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైన ముక్కలత్తూరు పంచాయతీ కార్యదర్శి
జిడి నెల్లూరు మండలం ముక్కలత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ జిల్లా స్థాయి స్వచ్ఛ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వచ్ఛతా హి సేవా ఉత్సవాల్లో భాగంగా, గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది.