ఉరవకొండ: కొనకొండ్ల గురుకుల పాఠశాల విద్యార్థులు క్షేమం... మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలోని గురుకుల పాఠశాల నుండి 9వ తరగతి చదువుతున్న . ప్రశాంత్ కుమార్, వడ్ల బద్రిలు సోమవారం జరిగిన మిస్సింగ్ ఘటనపై ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులు పోలీసులు 24 గంటల్లోనే మంగళవారం చేదించారు. విద్యార్థులు ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు మేరకు ఉరవకొండ రూరల్ సీఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడు బెలుగుప్ప ఎస్సై శివ, విడపనకల్లు ఎస్సై ఖాజా, వజ్రకరూరు ఎస్సై నాగ స్వామి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి కేసును పూర్తి చేశారు.