వరంగల్: వరంగల్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా: జైశ్రీరామ్ బ్రాండ్ పేరుతో దందా!
వరంగల్ జిల్లాలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయిస్తున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జైశ్రీరామ్ బ్రాండ్ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో లక్షల రూపాయల విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.