పార్వతీపురం: లబ్ధిదారులకు సకాలంలో రేషన్ అందాలి - జేసీ వైశాలి ఆదేశాలు
పార్వతీపురంలో రేషన్ పంపిణీపై జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు నిత్యావసరాలు సకాలంలో అందించాలని, రేషన్ షాపులు, గోదాములను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా సేవలు అందించాలని సూచించారు.