ఒంగోలు అర్బన్: విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన పలువురు అధికారులకు ప్రశంస పత్రాలు అందజేసిన మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శించిన పలువురు అధికారులకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ కుమారి పాల్గొన్నారు. ఇదేవిధంగా విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాలని ప్రశంస పత్రాలు అందుకున్న వారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.