ఏటూరునాగారం: రాంనగర్ గ్రామానికి నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన ఆర్టీసీ బస్సు సేవలు
ఏటూరునాగారం - మంగపేట మార్గంలోని రాంనగర్ గ్రామానికి నేటి నుంచి ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు నాలుగుసార్లు బస్సులను నడపాలని కోరినట్లు కోయగూడ ఉప సర్పంచ్ గార గాంధీ తెలిపారు. బస్సు రాకపోకలకు అనుగుణంగా రహదారిని, విద్యుత్ తీగలను సరిచేయిస్తామని వెల్లడించారు.