నారాయణపేట జిల్లాలో కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశీలనతోపాటు విద్యార్థుల పురోగతిపై మాట్లాడారు. మధ్యాహ్న భోజనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.