బనగానపల్లె: బేతంచర్లలో ఆటో ఢీకొని బీహార్ వాసి మృతి
బేతంచెర్లలోని డోన్ రోడ్డులో ప్రసాద్ స్లాబ్స్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బీహార్కు చెందిన గుల్షన్ కుమార్ (32) మృతి చెందాడు. ముచ్చట్లకు వెళ్లే రహదారి మధ్య రైల్వే అండరా పాస్ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం బేతంచెర్లకు బైకుపై వచ్చి, తిరిగి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. రైల్వే సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.