జనగాం: జనగామలో 16 కొత్త చెత్త సేకరణ ఆటోల ప్రారంభం: సిబ్బందితో సహపంక్తి భోజనం చేసిన ఛైర్ పర్సన్
జనగామ మున్సిపాలిటీలో కొత్తగా కొనుగోలు చేసిన 16 చెత్త సేకరణ ఆటోలను ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేసి, అందరూ కలిసికట్టుగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.