జిన్నారం: జిన్నారం మున్సిపాలిటీలో 33 కొత్త దుకాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జిన్నారంలో రూ. 1.80 కోట్లతో 33 దుకాణాల నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనివల్ల మున్సిపాలిటీకి నెలవారీ ఆదాయం పెరగనుంది. ఇప్పటికే రూ. 15 కోట్లతో వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.