కొండపి: సింగరాయకొండలో న్యాయవాదుల ఆందోళన: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్
విజయవాడలో న్యాయవాదులపై జరిగిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.