గిద్దలూరు: రాచర్ మండలంలో గోకులం షెడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పర్యటించారు. రంగారెడ్డి పల్లి గ్రామంలో గోకులం షెడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పల్లె పండుగ 3. o కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్ల నిర్మాణ పనులతో పాటు గోకులం షెడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.