నందికోట్కూరు: కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడుతున్న సప్త నదుల సంగమేశ్వర ఆలయం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ సప్త నదుల సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ వడి నుంచి బయటపడుతుంది, శ్రీశైల జలాశయం లోని నీటిమట్టం క్రమంగా తగ్గుతూ ఉండడంతో జలదిగ్బంధంలో ఉన్న ఆలయాల భాగాలు క్రమంగా దర్శనమిస్తున్నాయి, సప్త నదుల సంగమేశ్వర ఆలయ రాజగోపురం గోడల పై భాగం కనబడుతుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా బయట కనబడుతున్నది ఎగువ పుష్కర ఘాట్ నుంచి నది జలాలు క్రమంగా తగ్గుతున్నాయి, కృష్ణా నది నీటి ప్రవాహం తగ్గడంతో సంగమేశ్వర క్షేత్రం తన ప్రాచీన రూపాన్ని సంతరించుకుంటుంది ఆలయంలో ఉన్న వేపదారు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు