పటాన్చెరు: అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో గీతం విద్యార్థుల సత్తా: భారీగా పతకాల పంట
సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చాటారు. అథ్లెటిక్స్‌లో 17 పతకాలు, ఇతర క్రీడల్లో రజత పతకాలు సాధించిన విద్యార్థులను గీతం నాయకత్వం ఘనంగా సత్కరించింది.