అనకాపల్లి: జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లాలో జల జీవన్ మిషన్ కింద మంజూరైన 886 తాగునీటి పథకాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. రూ. 675.95 కోట్ల వ్యయంతో జరుగుతున్న పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.