ఆళ్లగడ్డ: ఇసుక పల్లిలో కరెంటు షాక్ తో వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండల పరిధిలోని ఇసుకపల్లి లో విద్యుత్ షాక్ కు గోపాల్ అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు శుక్రవారం మృతి చెందాడు, భార్య మృతి చెంది నెలరోజులు గడవక ముందే గోపాల్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది మృతుడికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, తల్లిదండ్రులను వరుసగా కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు, పెద్ద దిక్కున కోల్పోయిన ఆ పిల్లల దీనస్థితి అందరినీ కలచి వేస్తోంది