కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానస్పద మృతి, న్యాయం చేయాలని తల్లి నిరసన
ప్రకాశం జిల్లా సింగరాయకొం మండలంలోని మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీచైతన్య నవోదయ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆరు నెలలు గడిచినా తమకు న్యాయం జరగలేదని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గేట్ వద్ద ఆమె నిరసన చేపట్టి, తన కుమారుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు.