కనిగిరి: మార్కాపురంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కేంద్రమైన మార్కాపురం కు గురువారం వచ్చారు. కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో ఎమ్మెల్యే చర్చించారు. ఆలయాలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.