ఆళ్లగడ్డ: చింతకుంట చెరువుకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట చెరువు వద్ద ప్రజల కోసం 60 లక్షలతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు, రాయలసీమ విజయ్ భవ కార్యక్రమంలో భాగంగా చింతకుంట చెరువు సందర్శించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లా కలెక్టర్ తో చర్చించి నిధులు మంజూరు చేయించామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు