నిర్మల్: నిర్మల్లో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Sep 28, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 119వ జయంతిని నిర్వహించారు. దోపిడీ లేని సమాజం కోసం భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ విధానాలపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.