కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో భారీ వర్షం: పలుచోట్ల విద్యుత్ అంతరాయం
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతినగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.