ధర్మపురి: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.6.5 లక్షల విలువైన వాహనం విరాళం
హైదరాబాద్కు చెందిన ఆశిష్ కులకర్ణి, కవిత దంపతులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ.6.5 లక్షల విలువైన గూడ్స్ వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆలయ అవసరాల నిమిత్తం ఈ వాహనాన్ని సమర్పించగా, ఈవో సంకటాల శ్రీనివాస్ దాతలను సత్కరించారు.