పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: వైభవంగా సాగిన కల్పవృక్ష వాహన సేవ
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కల్పవృక్ష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ఈ వాహన సేవను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.