పలమనేరు: పెద్దపంజాణిలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం మాదనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.